జగన్ కు ఓటేస్తే ఆస్తులు గోవిందా

గుడివాడ వారాహి యాత్రలో పవన్ కల్యాణ్
జగన్ కు ఓటేస్తే ఆస్తులు గోవిందా
గుడివాడ బూతుల నేతను ఓడించాల్సిందే
బూతులు,దాడులు చేసే వారిపై పన్నువేస్తే
ఎపి ఆర్ధిక పరిస్థితి మెరగవుతుంది.
గుడివాడ – జగన్.. నువ్వంటే నాకు భయంలేదు.. దమ్ముంటే నా సినిమాలు ఆపితే ఆపుకో అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. గుడివాడలో నేడు జరిగిన వారాహి విజయభేరి సభ మాట్లాడుతూ.. జగన్ పై తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. జగన్ ఇచ్చిన మాటల్లో ఏ ఒక్కటి నిలబెట్టుకోలేదని.. వైసీపీకి ఓటు వేస్తే మీ ఆస్తులు గాల్లో దీపమే అని ఆయన అన్నారు.
కబ్జా రాయళ్లను ఓడించాల్సిందే..
‘ఎవరైనా చెరువులు తవ్విస్తారు.. కానీ వీళ్లు కబ్జా చేశారు. బూతులు తిట్టేవాళ్లను, గోతులు తవ్వేవాళ్లను సాగనంపాలి. రాజకీయ నేతల బూతులు, దాడులకు పన్ను వేస్తే నిధులకు కొరతే ఉండదు. ఇంట్లో ఉన్నవాళ్లను కూడా వ్యక్తిగతంగా దూషిస్తున్నారు. జగన్ ప్రభుత్వం.. దాడులు, దోపిడీలు, బూతులు తప్ప చేసిందేమీ లేదు. జగన్ ను చూసి, వైకాపా నాయకులను చూసి భయపడాలా?.. జగన్ అంటే నాకు భయం లేదు. నా సినిమాలు ఆపితే ఆపుకో. మన నేలను విడిచి ఎక్కడికి పారిపోతాం.. మీ గుండెల్లో ధైర్యం నింపడానికే నేనొచ్చా. మాటిస్తే ప్రాణాలు పోవాలిగానీ.. వెనక్కి తీసుకోకూడదు’ అని పవన్ కల్యాణ్ అన్నారు.
వర్శిటి పేరు ఎందుకు మార్చాలి..
ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరును మార్చాల్సిన అవసరమేమొచ్చిందంటూ జగన్ పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటమే తనకు ముఖ్యమని, స్వేచ్ఛ పోయినరోజు ఎన్ని వేల రూ. కోట్లున్నా నిష్ర్పయోజనమే అని ఆయన అన్నారు. చంద్రబాబు బలమైన నాయకుడని , జైలులో ఉన్నా కూడా ఆయన ఏ మాత్రం తొణకలేదన్నారు. అలాంటి వ్యక్తికి అండగా ఉండాలని ఆనాడే నిర్ణయించుకున్నానని పవన్ చెప్పారు. 30 కేసులుండి.. ఐదేళ్ల నుంచి జగన్ బెయిల్ పై బయట తిరుగుతున్నారని ఆక్షేపించారు.. కూటమి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని ఆయన ఓటర్లను అభ్యర్ధించారు. తాము అధికారంలోకి వచ్చినంక మేనిఫెస్టోలోని ప్రతి హామీని నెరవేరుస్తామన్నారు
About The Author
Related Posts
Latest News
