ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న
పొన్నూరు జనసేన నాయకులు గుంటూరు కూరగాయల మార్కెట్ కమిటీ చైర్మన్ వీరిశెట్టి లక్ష్మణ్
గుంటూరు,పెదకాకాని ( జర్నలిస్ట్ ఫైల్) : ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం దైవ సేవతో సమానమని పొన్నూరు నియోజకవర్గ జనసేన క్రియాశీల నాయకులు, గుంటూరు కూరగాయల మార్కెట్ కమిటీ అధ్యక్షులు వీరిశెట్టి లక్ష్మణ్ అన్నారు. బుధవారం పెదకాకాని పాతూరులో పేద మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఓ ముస్లిం యువతి వివాహానికి దుల్హన్ పథకం కింద ఆర్థిక సహాయం అందజేశారు.
ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ ...ఎదుటివారి కష్టాన్ని తెలుసుకొని స్పందించి తన వంతు సహకారం అందించే జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ ను ఆదర్శంగా తీసుకుని ఆయన బాటలో పయనిస్తున్నట్లు తెలిపారు. బిజెపి, తెలుగుదేశం,జనసేన కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలుస్తుందని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలతో ముందుకు వెళుతున్న కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని అభినందించాల్సిన అవసరం ఉందని అన్నారు.రాష్ట్రంలో ఏ ఒక్కరికి కష్టం వచ్చినా తమ కష్టంగా భావించే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఉండటం మన అదృష్టమని అన్నారు.
తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త పాతూరు గ్రామానికి చెందిన పుప్పాల సాంబశివరావు,మణికంఠ తమ వంతు సహాయాన్ని ఆ కుటుంబానికి అందజేసి భవిష్యత్తులో కూడా ఆ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పెదకాకాని మండల తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ మాజీ అధ్యక్షులు షేక్ ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు.