prajagalam sabha
Andhra Pradesh 

గెలిచినా.. బాబుకు గండమే !?

గెలిచినా.. బాబుకు గండమే !? మొన్న ఆదివారం చిలకలూరిపేటలో ఎన్డీఏ కూటమి నిర్వహించిన  ప్రజాగళం సభకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా విచ్చేసి చేసిన ప్రసంగం టీడీపీ , జనసేన పార్టీలకు ఏ మేర ప్రయోజనం చేకూర్చిందో తెలీదు కానీ, రాష్ట్ర బీజేపీ శ్రేణులకు మాత్రం అమితమైన ఆనందం ఇస్తోంది.  తమ బీజేపీ పార్టీకి తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి పదవి వరించనున్నట్లుగా ... తమ పార్టీకి చెందిన అభ్యర్థి ఏపీ ముఖ్యమంత్రి అవ్వబోతున్నట్లుగా పరోక్ష సందేశం ప్రధాని మోడీ అందించారని, ఆయన ప్రసంగంలో గూడార్ధం అదేనని  బీజేపీ శ్రేణులు సంబరపడుతున్నారు.టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ఓట్లేయాలని అని చెప్పకుండా ఎన్డీయే కూటమికి ఓట్లేయాలని ప్రజలకు మోదీ పిలుపునిచ్చారు. కేంద్రంలో ఎన్డీయే కూటమికి నాయకత్వ స్థానంలో ఉంది బీజేపీయే కావడం ఇక్కడ గమనార్హం. తన ప్రసంగం ఆద్యంతం ప్రధాని మోదీ ఎన్డీయే కూటమిని గెలిపించాలని అన్నారే కానీ చంద్రబాబు సీఎం కావాలని లేదా పవన్‌ సీఎం కావాలని వ్యాఖ్యానించలేదు. మూడు పార్టీల కూటమి ద్వారా అధికారంలోకి వస్తే చంద్రబాబే  సీఎం అని టీడీపీ శ్రేణులతో పాటు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం గట్టిగా ఫిక్స్ అయిపోయిన తరుణంలో... ప్రజాగళంలో సభలో  'ఎన్డీఏ  ముఖమంత్రి ' అని నరేంద్ర మోడీ  ప్రస్తావన చేయడంతో టీడీపీ , జనసేన నేతలు అయోమయానికి గురవుతున్నారు.
Read More...

టీడీపీ, బీజేపీ మధ్య డీల్‌ ఏమిటి?

టీడీపీ, బీజేపీ మధ్య డీల్‌ ఏమిటి?    పొలిటికల్ డెస్క్ ( జర్నలిస్ట్ ఫైల్)  : తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ( Nara Chandrababu Naidu ) , ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ( Prime Minister  Narendra Modi ) మధ్య డీల్‌ ఏమిటో రాష్ట్ర ప్రజలకు చెప్పాలని వైసిపి నాయకులు, మాజీ మంత్రి పేర్ని నాని ( ...
Read More...
Andhra Pradesh 

రాష్ట్రాన్ని కాపాడుకోవాలి.. ప్రజలు గెలవాలి..

రాష్ట్రాన్ని కాపాడుకోవాలి.. ప్రజలు గెలవాలి.. చిలకలూరిపేట ( జర్నలిస్ట్ ఫైల్)  మార్చి 17 :  ఈ ఎన్నికల్లో గెలుపు ఎన్డీయేదేనని ఇందులో ఎవరికీ అనుమానం లేదని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. తెదేపా, జనసేన, భాజపా ఆధ్వర్యంలో బొప్పూడిలో ఏర్పాటు చేసిన ప్రజాగళం బహిరంగ సభకు ప్రధాని మోదీ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. “ఐదు కోట్ల తెలుగు...
Read More...
Andhra Pradesh 

ఎన్ డీ ఏ ప్రభుత్వంతోనే రాష్ట్రాభివృద్ధి

ఎన్ డీ ఏ ప్రభుత్వంతోనే రాష్ట్రాభివృద్ధి చిలకలూరిపేట( జర్నలిస్ట్ ఫైల్)  మార్చి 17 : రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నామని జనసేన అధినేత పవన్ కల్యాణ్  అన్నారు. తెదేపా, జనసేన, భాజపా ఆధ్వర్యంలో బొప్పూడిలో ఏర్పాటు చేసిన ప్రజాగళం బహిరంగ సభకు ప్రధాని మోదీ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఉమ్మడిగా నిర్వహించిన చిలకలూరిపేట ‘ప్రజాగళం’ సభకు పెద్ద ఎత్తున...
Read More...