రూ. 60 లక్షలతో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు శంకుస్థాపన

రూ. 60 లక్షలతో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు శంకుస్థాపన

 

 గుంటూరు, కాకుమాను  ( జర్నలిస్ట్ ఫైల్ ) : కాకుమాను మండలం కొమ్మూరులో ఎమ్మెల్యే డా. బూర్ల రామాంజనేయులు పర్యటించారు. రూ. 60 లక్షలతో చేపట్టబోతున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో మాట్లాడిన ఎమ్మెల్యే రామాంజనేయులు పలు కీలక అంశాలను ప్రస్తావించారు.

మద్యం వ్యాపారం విషయంలో గత ప్రభుత్వంపై విమర్శలు చేసిన రామాంజనేయులు, “మునుపటి ప్రభుత్వంలో ఒక్క బ్యాంక్ లావాదేవీ కూడా జరగలేదు” అని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీలో క్యాష్ లావాదేవీలతో మద్యం విక్రయాలు జరిగాయని ఆయన ఆరోపించారు.

తమ ప్రభుత్వం మద్యం దుకాణాలకు సంబంధించిన అన్ని లావాదేవీలను బ్యాంకు మార్గం ద్వారా పారదర్శకంగా నిర్వహిస్తుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. “ప్రతి లావాదేవీకి లెక్కలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో వచ్చిన మద్యం డబ్బులు ఎక్కడికి పోయాయో త్వరలో తెలుస్తుంది” అని అన్నారు.

కూటమి ప్రభుత్వం నాణ్యమైన మద్యం మాత్రమే ప్రజలకు అందేలా చర్యలు తీసుకుంటుందని, తమకు ఆదాయం కంటే ప్రజల ప్రాణాలే ముఖ్యమని ఆయన చెప్పారు. మద్యం దుకాణాల రిజిస్ట్రేషన్లు ఇంకా పూర్తికాకపోయినా, వైసీపీ దోచుకుందని ఆరోపణలు చేయడాన్ని విమర్శించారు.

“రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్ళుగా చూసుకుంటూ ముందుకు సాగుతోంది” అని రామాంజనేయులు పేర్కొన్నారు.

ఈ పర్యటనలో గ్రామస్థులు ఎమ్మెల్యేతో సమస్యలను పంచుకుంటూ, అభివృద్ధి పనులకు ధన్యవాదాలు తెలిపారు.

About The Author

Related Posts

Latest News