బాలిక హత్య కేసును ఛేదించిన పోలీసులు.. 

బాలిక హత్య కేసును ఛేదించిన పోలీసులు.. 

 
హోంమంత్రి అనిత కీలక వ్యాఖ్యలు
 
( క్రైం బ్యూరో, జర్నలిస్ట్ ఫైల్ ) రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న బాలిక హత్య కేసును పోలీసులు ఛేదించారు. పుంగనూరులో ఏడేళ్ల బాలిక దారుణ హత్యకు గురైన ఘటన పై తాజాగా ఏపీ హోం మంత్రి అనిత స్పందించారు. ఈ నేపథ్యంలో బాలిక హత్య కేసును పోలీసులు ఛేదించినట్లు హోం మంత్రి అనిత ప్రకటించారు. ఆ చిన్నారి ఆచూకీ కోసం 12 ప్రత్యేక పోలీసు బృందాలు గాలించినట్లు హోం మంత్రి అనిత తెలిపారు. చిన్నారి హత్యకు గురికావడం బాధాకరమైన విషయం అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. ఈ క్రమంలో గత వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. వైసీపీ హయాంలో వందల మందిపై అత్యాచారాలు జరిగాయని అన్నారు. కానీ మాజీ సీఎం జగన్ ఏ ఒక్కరోజు తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు రాలేదని ఫైరయ్యారు. చిన్నారి హత్య కేసును వైసీపీ రాజకీయం చేస్తుందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చిన్నారిపై అత్యాచారం జరగలేదని చిన్న గాయం లేదని పోస్టుమార్టం రిపోర్టులో తేలిందని హోం మంత్రి అనిత తెలిపారు.

About The Author

Related Posts

Latest News