ఎన్ డీ ఏ ప్రభుత్వంతోనే రాష్ట్రాభివృద్ధి

ఎన్ డీ ఏ ప్రభుత్వంతోనే రాష్ట్రాభివృద్ధి

చిలకలూరిపేట( జర్నలిస్ట్ ఫైల్)  మార్చి 17 : రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నామని జనసేన అధినేత పవన్ కల్యాణ్  అన్నారు. తెదేపా, జనసేన, భాజపా ఆధ్వర్యంలో బొప్పూడిలో ఏర్పాటు చేసిన ప్రజాగళం బహిరంగ సభకు ప్రధాని మోదీ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఉమ్మడిగా నిర్వహించిన చిలకలూరిపేట ‘ప్రజాగళం’ సభకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. మూడు పార్టీల పొత్తు కుదిరిన అనంతరం తొలిసారిగా ప్రధాని నరేంద్ర మోదీ, నారా చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఒకే వేదిక కనిపించడంతో.. అభిమానులు కేరింతలు కొట్టారు   
ఈ సందర్భంగా పవన్ ఉద్వేగభరితంగా ప్రసంగించారు.  2014లో తిరుపతి వేంకటేశ్వరస్వామి సాక్షిగా ప్రారంభమైన పొత్తు.. ఇప్పుడు బెజవాడ దుర్గమ్మ సాక్షిగా కొత్త రూపు తీసుకోబోతోందన్నారు. దుర్గమ్మ తల్లి ఆశీస్సులతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ ఒక సారా వ్యాపారి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం పవన్ చెప్పారు. ఐదుకోట్ల మందికి అండగా ఉంటానని చెప్పేందుకు మోదీ వచ్చారన్నారు. అమరావతి దేదీప్యమానంగా వెలగబోతోందని.. అమరావతికి అండగా ఉంటానని చెప్పేందుకు మోదీ వచ్చారన్నారు పవన్. 
“అభివృద్ధిలేక అప్పులతో నలిగిపోతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి నరేంద్రమోదీ రాక బలాన్నిచ్చింది. ఎన్డీయే పునర్ కలయిక ఐదు కోట్ల మందికి ఆనందాన్ని ఇచ్చింది. మూడోసారి ప్రధానమంత్రి అయి హ్యాట్రిక్ కొట్టబోతున్న మోదీకి ఏపీ ప్రజల తరఫున ఘన స్వాగతం. 2014లో తిరుపతి వేంకటేశ్వరస్వామి సాక్షిగా ప్రారంభమైన పొత్తు.. ఇప్పుడు బెజవాడ దుర్గమ్మ సాక్షిగా కొత్త రూపు తీసుకోబోతోంది. అమరావతికి అండగా ఉంటానని చెప్పేందుకే ఆయన వచ్చారు. అమరావతి దేదీప్యమానంగా వెలగబోతోంది. ఎన్డీఏ కలయిక.. ఐదుకోట్ల మంది ప్రజలకు ఆనందం అని పేర్కొన్నారు.
ఇదిలావుండగా.. పవన్ ప్రసంగిస్తున్న సమయంలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. సభలో జనం కిక్కిరిసిపోవడంతో కొందరు ఫోకస్ లైట్ల టవర్‌పైకి ఎక్కగా.. ప్రధాని మోదీ మైక్ అందుకొని వారిని కిందకు దిగాలని విజ్ఞప్తి చేశారు. అటు.. బారికేడ్లు ఎక్కిన అభిమానుల్ని కూడా కిందకి దిగమని కోరారు. పోలీసులు వారిని కిందకు దించాలని, అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. దీంతో అందరూ కిందకు దిగొచ్చారు.

About The Author

Related Posts

Latest News