కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మను ఘనంగా సత్కరించిన ఏపీ జేఏసీ అమరావతి
విజయవాడ ( జర్నలిస్ట్ ఫైల్ ) : భారతీయ జనతా పార్టీలో సాధారణ సభ్యునిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి, కష్టపడి, నిజాయితీ, నిబద్ధతతో అంచెలంచెలుగా ఎదిగి కేంద్ర మంత్రి హోదాకు చేరుకున్న భూపతిరాజు శ్రీనివాసవర్మ గారిని విజయవాడలో ఘనంగా సత్కరించారు.
కేంద్ర ఉక్కు మరియు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా భాద్యతలు స్వీకరించిన సందర్భంగా, ఏపీ జేఏసీ అమరావతి నాయకులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, పలిశెట్టి దామోదరరావు, కనపర్తి సంగీతరావు ఆధ్వర్యంలో, వివిధ అనుబంధ సంఘాల నాయకులు కలసి, భూపతిరాజు శ్రీనివాసవర్మ గారిని ఘనంగా సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏపీ జేఏసీ అమరావతి స్టేట్ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, భూపతిరాజు ప్రాముఖ్యతను, ఉద్యోగులకు ఆయన కట్టుబాటును, వారి సంక్షేమంపై ఆయన ప్రత్యేక శ్రద్ధను కొనియాడారు. ఆయన ప్రజా శ్రేయస్కరంగా పనిచేసి ప్రజల మనస్సులలో చిరస్మరణీయమైన స్థానాన్ని సంపాదించుకోవాలని ఆకాంక్షించారు.
ఈ సత్కార కార్యక్రమంలో రెవెన్యూ సర్వీసెస్ అసోషియేషన్ రాష్ట్ర నాయకత్వం, ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.వి. నరసయ్య, పి.ఆర్. ఇంజనీర్స్ అసోషియేషన్ అధ్యక్షులు కె. సంగీతరావు, ఏపీ పోలీస్ ఆఫీసర్స్ అసోషియేషన్ అధ్యక్షులు జనుకుల శ్రీనివారావు తదితరులు పాల్గొన్నారు.
మహిళా విభాగం స్టేట్ చైర్ పర్సన్ పారే లక్ష్మి, సెక్రటరీ జనరల్ పొన్నూరు విజయలక్ష్మి, క్లాస్-4 ఎంప్లాయీస్ అసోషియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్. మల్లేశ్వరరావు, మున్సిపల్ ఎంప్లాయీస్ అసోషియేషన్ నాయకులు నాగేశ్వరరావు, ప్రభుత్వ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోషియేషన్ నాయకులు పుల్లయ్య, డి.ఎల్.పి.ఓ & డి.పి.ఓ ల రాష్ట్ర అసోషియేషన్ అధ్యక్షులు కె.పి. చంద్రశేఖర్, గ్రామ వర్డ్ సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి. అర్లయ్య తదితరులు కూడా ఈ సత్కార కార్యక్రమంలో పాల్గొన్నారు.